రిపబ్లిక్ ఆఫ్ మోల్డోవా అధ్యక్షురాలితో సమావేశమైన పోప్

శుక్రవారం 12 సెప్టెంబర్ ఉదయం వాటికన్‌లో మోల్డోవా అధ్యక్షురాలు Maia Sandu పోప్ లియో తో సమావేశమైయ్యారు . 

పోప్‌తో సమావేశమైన తర్వాత వీరు హోలీ సీ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌ మరియు రాష్ట్రాలు మరియు అంతర్జాతీయ సంస్థలతో సంబంధాల కార్యదర్శి ఆర్చిబిషప్ పౌల్ ను కలిసినట్లు హోలీ సీ ప్రెస్ ఆఫీస్ పేర్కొంది

సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్‌లో జరిగిన స్నేహపూర్వక చర్చల సందర్భంగా, ఇప్పటికే ఉన్న సానుకూల ద్వైపాక్షిక సంబంధాలకు ప్రశంసలు వ్యక్తమయ్యాయి, వాటిని మరింత బలోపేతం చేసే ఉద్దేశ్యంతో.

చర్చలలో భాగంగా స్థానిక, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో శాంతి మరియు భద్రతల పరిస్థితిని కూడా ప్రస్తావించారు, ముఖ్యంగా ఉక్రెయిన్‌లో ఇటీవలి పరిణామాలను ప్రస్తావించడం జరిగింది