రాబర్ట్ డి నిరోతో సమావేశమైన పోప్ లియో
శుక్రవారం నవంబర్ 7 ఉదయం అపోస్టోలిక్ ప్యాలెస్‌లో Robert De Niro పోప్ లియోతో సమావేశమయ్యారు.
ముందు రోజు సాయంత్రం, నటుడు రోమ్ నగర కౌన్సిల్ ప్రదానం చేసిన అత్యున్నత గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు.
నోబు హోటల్ ప్రారంభోత్సవం కారణంగా ఇటాలియన్ రాజధానికి ఆయన పర్యటించడం జరిగింది.
Sala del Tronetto లో ఈ సమావేశం జరగగా వారు పోప్ తో కొదిసేపు మాట్లాడారు అనంతరం ఆయనతో పాటు వచ్చిన ఐదుగురు వ్యక్తులతో కూడా సంభాషించారు
అక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పోప్ జపమాలను బహూకరించడం జరిగింది