టర్కీ మరియు లెబనాన్ కు పోప్ లియో తొలి విదేశీ పర్యటన

27 నవెంబర్ నుండి 2 డిసెంబర్ 2025 వరకు ఇటలీ వెలుపల తన తొలి అపోస్తోలిక ప్రయాణాన్ని పోప్ లియో ప్రారంభించనున్నారు. 

ఈ సందర్భంగా ఆయన టర్కీ మరియు లెబనాన్ దేశాలను సందర్శించనున్నారు. 

ఈ పర్యటనలో పౌర మరియు మత పెద్దలతో సమావేశాలు, మసీదులు మరియు చారిత్రక దేవాలయాలను సందర్శనలు, నైసియా 1700వ వార్షికోత్సవానికి సంబంధించిన క్రైస్తవుల ఐక్యతా వేడుక, అలాగే 2020 బీరూట్ పోర్ట్ పేలుడులో బాధితుల కోసం ప్రార్థనలు చేయనున్నారు.


ఈ అపోస్తొలిక పర్యటన బలమైన ఐక్యభావం మరియు మతాంతర సంభాషణ పెంపొందించేందుకు ప్రయత్నిస్తుంది అని హోలీ సి ప్రకటనలో పేర్కొంది.   

పోప్ లియో పర్యటనలో అంకారా, ఇస్తాంబుల్ మరియు ప్రాచీన నగరం ఇజ్నిక్ (పూర్వ నైసియా) సందర్శనలు కూడా ఉన్నాయి. అక్కడ పొప్ క్రైస్తవ చరిత్రలో కీలకమైన నైసియా మండలి వార్షికోత్సవాన్ని స్మరించనున్నారు. 

అనంతరం లెబనాన్‌కు వెళ్లి పౌర మరియు చర్చిల నేతలను కలవడం, అలాగే గత సంక్షోభాలతో ప్రభావితమైన సముదాయాలతో ఐక్యతను వ్యక్తం చేయడం జరగనుంది