జూన్ మాస ప్రార్థన ఉద్దేశాన్ని ప్రకటించిన పోప్

జూన్ మాస ప్రార్థన ఉద్దేశాన్ని ప్రకటించిన పోప్
XIV లియో పోప్ జూన్ నెలలో తన మొదటి మాస ప్రార్థన ఉద్దేశ్యాన్ని విడుదల చేశారు.
ప్రతి ఒక్కరూ యేసుతో వ్యక్తిగత సంబంధంలో ఓదార్పును పొందగలమని,ప్రభుని తీరు హృదయం నుండి ప్రపంచంపై కరుణ చూపడం నేర్చుకోవాలని పోప్ అన్నారు.
ప్రతి ఏటా జూన్ మాసం యేసు తీరు హృదయ భక్తికి అంకితం చేయబడిన విషయం మనకు తెలిసిందే.
8 మే 2025న పేతురు 266వ వారసుడిగా పోప్ ఎన్నికైన తర్వాత మొదటిసారిగా,XIV లియో పోప్ మొదటిసారి తన స్వరాన్ని వీడియో ప్రార్థన ఉదేశంలో వింటున్నాము
విశ్వ ప్రపంచం కరుణతో ఎదగాలని ప్రతి ఒక్కరు ప్రార్థించాలని, ప్రతి విశ్వాసి క్రీస్తు తిరు హృదయం నుండి పరులపట్ల ఎలా దయ కలిగి జీవించాలో నేర్చుకోవాలని విశ్వ శ్రీసభను ఆదేశించారు.