సకల మృతుల సంస్మరణ దివ్యబలిపూజను సమర్పించిన పోప్
నవంబర్ 2న సకల మృతుల సంస్మరణ సందర్భంగా పోప్ లియో రోమ్‌లోని Verano స్మశానవాటికలో దివ్యబలిపూజను సమర్పించారు.
ఈ సందర్భంగా పోప్ పుష్పగుచ్ఛాన్ని సమర్పించి, మరణించిన వారందరికీ నివాళులర్పించారు.
తన సందేశంలో... నేటి యుద్ధాలు, ఘర్షణల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తుచేసుకుంటూ, తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాల కోసం ప్రార్థించారు. ముఖ్యంగా తల్లులు, పిల్లలు, వృద్ధుల కన్నీళ్లు..... ఆయుధాలను మౌనం చేయగల అధికారుల మనస్సాక్షిని కదిలించాలని పిలుపునిచ్చారు.
క్రీస్తుపై విశ్వాసం ద్వారా మరణించిన వారితో మన బంధం తెగిపోదని, అది నూతన రూపాన్ని సంతరించుకుంటుందని పోప్ తెలిపారు.
మరణించిన వారి కోసం చేసే ప్రార్థనలు, దివ్యసత్ప్రసాద స్వీకారం ద్వారా వారితో మన ఆధ్యాత్మిక ఐక్యత మరింత బలపడుతుందని వివరించారు.
మరణించిన వారి కోసం ప్రార్థించే ఈ సంప్రదాయం వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉంది.
