గాజా శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చిన పోప్

అక్టోబర్ 5 ఆదివారం సెయింట్ పీటర్స్ స్క్వేర్లో జరిగిన దివ్యబలిపూజ అనంతరం
గాజా శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ప్రపంచ నాయకులకు పిలుపునిచ్చారు.
ఈ ఒప్పందం "సాధ్యమైనంత త్వరగా" ఖరారు అవుతుందని పోప్ తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
"న్యాయమైన మరియు శాశ్వత శాంతి" కొరకు "ప్రార్థనలు చేయాలని విశ్వాసులను కోరారు.
తేలికపాటి వర్షం ఉన్నప్పటికీ వలసదారుల జూబ్లీకి హాజరైన వారికి పోప్ ధన్యవాదాలు తెలిపారు.
"ప్రేషిత సేవకు అంకితం చేయబడినది మన శ్రీసభ" అని దీనిని వలసదారులు మనకు గుర్తు చేస్తున్నారు" అని పోప్ పేర్కొన్నారు
తమ పరిస్థితుల కారణంగా ఎవరూ పారిపోవడానికి మన పాత్రులము కాకూడదని,దోపిడీకి ఎవ్వరు గురికాకూడదు, మనమందరం మానవ గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని పోప్ అన్నారు