ఆదివాసి దినోత్సవం మరియు జాతీయ యువజన ఆదివారాన్ని జరుపుకున్న బెంగాల్
పశ్చిమ బెంగాల్, కళ్యాణి,డాన్ బాస్కో దేవాలయము నందు ఆగస్టు 20న ఆదివాసి దినోత్సవం మరియు జాతీయ యువజన ఆదివారం వేడుకలు జరుపుకున్నారు.
బండేల్,డాన్ బాస్కో చెందిన గురుశ్రీ అనిల్ టోప్పో(SDB) గారు ఉదయం దివ్యబలి పూజ సమర్పించారు.
గురుశ్రీ అరవింద్ క్సాల్క్సో, SDB మరియు డీకన్ బిస్వజిత్ మోండల్ సమక్షంలో వేడుకలు మరింత ప్రత్యేకంగా జరిగాయి.
దాదాపు 200 మంది కథోలికులు, ప్రప్రధమంగా ఆదివాసీ కమ్యూనిటీకి చెందినవారు దివ్యబలిపూజలో పాల్గొన్నారు.
"వరల్డ్ ఆఫ్ సోషల్ మీడియా కల్చర్" అనే నేపథ్యంపై జరిగిన సెమినార్‌కు కలకత్తాలోని నితికా డాన్ బాస్కో క్యాటెకెటికల్ మరియు మీడియా సెంటర్‌కు ఇన్‌ఛార్జ్ అయిన గురుశ్రీ అరవింద్ క్సల్క్సో, SDB నాయకత్వం వహించారు.
కళ్యాణిలోని డాన్ బాస్కో కాథలిక్ చర్చిలో ఆదివాసి దినోత్సవం మరియు జాతీయ యువజన ఆదివారం ఉమ్మడి వేడుక విశ్వాసుల మధ్య ఐక్యతను పెంపొందించింది