పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు వేసవి శిబిరంలోని పిల్లలను సందర్శించారు

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు వేసవి శిబిరంలోని  పిల్లలను సందర్శించారు


పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు, ప్రతి సంవత్సరం మాదిరిగానే, వాటికన్ లో సమ్మర్ క్యాంప్‌లోని  వాటికన్ ఉద్యోగుల  పిల్లలను ప్రత్యేకంగా సందర్శించారు.

వాటికన్ ఉద్యోగుల పిల్లలు వేసవి శిబిరం కార్యక్రమంలో భాగంగా కొత్త అవుట్‌డోర్ స్పోర్ట్స్ ఏరియా మరియు స్విమింగ్ పూల్ ను  ప్రారంభించారు. సెయింట్ జోసెఫ్ సెంటర్ జూన్‌లో ప్రారంభించబడింది మరియు అనేక చిన్న ఆస్ట్రోటర్ఫెడ్ ఫీల్డ్‌లు, ఒక టెన్నిస్ కోర్ట్ మరియు గ్రౌండ్  స్విమింగ్ పూల్ ను కలిగి ఉంది. గత సంవత్సరాల్లో, 5-13 సంవత్సరాల పిల్లల కోసం వేసవి కార్యక్రమం వాటికన్ యొక్క పాల్ VI హాలులో నిర్వహించబడింది.

పిల్లల అడిగిన కొన్ని ప్రశ్నలకు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సమాధాన ఇచ్చారు.  బాలునిగా  ఉన్నప్పుడు తన హీరోలు ఎవరు అన్న ప్రశ్నకు "చిన్నపుడు నా హీరోలు - నా తల్లిదండ్రులు," అని  ఫ్రాన్సిస్ పాపు గారు సమాధానమిచ్చారు.
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అర్జెంటీనాలో తన నలుగురు తోబుట్టువులతో పెరిగిన కొన్ని జ్ఞాపకాలను పంచుకున్నారు, అందులో తన  తల్లిదండ్రులు మరియు అవ్వ, తాతయ్య లతో వేసవి కాలం సెలవులలో గడిపిన రోజులను  గుర్తు చేసుకున్నారు.
 

"మీ అవ్వ, ,తాతయ్యలతో మాట్లాడండి" మరియు వారితో సన్నిహితంగా ఉండండి అని  పాపు గారు పిల్లలకు చెప్పారు. "మంచి మార్గం లో నడవడానికి   అవ్వ, తాతలు మనకు  సహాయం చేస్తారు అని అన్నారు.పిల్లలను ఎల్లప్పుడూ శాంతి స్థాపకులుగా ఉండాలని ఈ సందర్భముగా ఫ్రాన్సిస్ పాపు గారు పిల్లలను ప్రోత్సహించారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer