ఘనంగా జాతీయ యువతా దినోత్సవం

ఘనంగా జాతీయ యువతా దినోత్సవం

విశాఖ అతిమేత్రాసనం ఎర్ర సామంతవలస గిరిజన విచారణలో  18 ఆగష్టు, ఆదివారం  నాడు    జాతీయ యువత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, ఎర్ర సామంతవలస విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

యువతీ యువకుల కొరకు ప్రత్యేక దివ్య పూజా బలి మరియు ఆరాధనను గురుశ్రీ పి జీవన్ బాబుగారు నిర్వహించారు. విచారణ సిస్టర్స్, అధిక సంఖ్యలో యువతీ యువకులు ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.  విచారణ గాయకబృందం మధురమైన గీతాలను ఆలపించారు.

అనంతరం ఎర్ర సామంతవలస గ్రామంలో పారిశుద్ధ్య పనులు యువత చేపట్టారు.హెల్పింగ్ హాండ్స్ అనే నినాదంతో గురుశ్రీ పి జీవన్ బాబు గారు ,విచారణ సిస్టర్స్ మరియు యూత్ లీడర్  రాయల అనిరుద్, విచారణ యువత అందరు పాల్గొని గ్రామంలో రోడ్లు , మురుగు కలువాలను పూడిక తీసి శుభ్రం చేసారు.

విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు.

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer