రోమ్ మేత్రాసన సహాయక పీఠాధిపతిగా అభిషేకింపబడిన మోన్సిగ్నోర్ రినాటో  

రోమ్, సెయింట్ జాన్ లాటరన్ బసిలికాలో, జనవరి 4, శనివారం మధ్యాహ్నం మోన్సిగ్నోర్ రినాటో టరాంటెల్లి బకారీ ని పీఠాధిపతిగా అభిషేకించారు.

నవంబర్ 21న రోమ్ మేత్రాసన సహాయ పీఠాధిపతిగా మరియు వైస్-రీజెంట్‌గా మోన్సిగ్నోర్ రినాటో టరాంటెల్లి బకారీని పొప్ ఫ్రాన్సిస్ నియమించారు 

కార్డినల్ వికార్ బల్దస్సరే రీనాకు "మేత్రాసన పరిపాలనలో మద్దతు" అందించడంలో సహాయం చేసేందుకు నియమించినట్లు అదే రోజున పోప్ ఫ్రాన్సిస్ పంపిన లేఖలో పేర్కొని ఉంది. 

పొప్ ఫ్రాన్సిస్ సమక్షమున, కార్డినల్ వికార్ బల్దస్సరే మోన్సిగ్నోర్ రినాటో ని పీఠాధిపతిగా అభిషేకించారు.

వియన్నా అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహా పూజ్య క్రిస్టోఫ్ స్కోన్‌బోర్న్ (Christoph Schöన్బర్న్),రోమ్ సహాయక పీఠాధిపతి మహా పూజ్య మిచెల్ డి టోల్వ్‌చే ఈ పీఠాధిపత్య అభిషేక దివ్యబలిపూజలో పాల్గొన్నారు