రాయపురంలో మరియదళ ప్రారంభం

11 ఆగస్టు 2024 న నల్గొండ మేత్రాసనం, రాయపురం,పునీత పేతురు గారి విచారణలో నూతన మరియదళ ప్రారంభం జరిగింది.

నల్గొండ పీఠానికి నూతనంగా అభిషేకింపబడిన శ్రీ శ్రీ శ్రీ మహా పూజ్య కరణం దమన్ కుమారు గారు మొట్టమొదటిసారి విచారణకు విచ్చేయగా, విచారణ కర్తలు గురుశ్రీ టీ బాలశౌరి గారి ఆధ్వర్యంలో ఆ విచారణ విశ్వాసులు ఘనంగా స్వాగతం పలికారు. 

పీఠాధిపతులవారు మరియు ఐదుగురు గురువులు కలిసి దివ్యపూజను సమర్పించారు.

మరియతల్లి ద్వారా క్రీస్తును అనుసరించాలిని మరియదళ సభ్యుల యొక్క ఆశయంగా ఉండాలి, మరియదళం యొక్క విశిష్టతను వారు చేయవలసిన కర్తవ్యాలను తెలియచేసి ఆధ్యాత్మికంగా వారు ఎదుగుతూ ఇతరులను ఎలా ముందుకు నడపాలో పీఠాధిపతులవారు వారి ప్రసంగంలో తెలియచేసారు.

మరియదళంలో విచారణకు చెందిన 78 మందిని ఆశీర్వదించి,ప్రవేశ పత్రాన్ని ఇచ్చారు.

విచారణ కర్తలు మాట్లాడుతూ "మరియదళంలో చేరాలి అనుకున్న వారికి మూడు నెలలనుండి తర్ఫీదు ఇస్తున్నారని, మట్టంపల్లి మరియదళం బృదం వారిచే తర్ఫీదు ఇప్పించారని తెలియచేసారు.

సుమారు 400 మంది విశ్వాసులు ఈ దివ్యబలి పూజలో పాల్గొన్నారు.

దివ్యపూజాబలి అనంతరం విచారణ కర్తలు ప్రేమ  విందు ఏర్పాటు చేశారు.