భారతదేశంలో మొదటి మాగిస్ అవార్డును అందుకున్న ప్రముఖ విద్యావేత్త గురుశ్రీ జాన్ ఫెలిక్స్ రాజ్

మాగిస్ అవార్డు
గురుశ్రీ జాన్ ఫెలిక్స్ రాజ్

జేసు సభ గురువు, సెయింట్ జేవియర్స్ యూనివర్శిటీ, కోల్‌కతా (SXUK) వైస్-ఛాన్సలర్ గురుశ్రీ  జాన్ ఫెలిక్స్ రాజ్ గారు జనవరి 27, 2024న కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో,  మాగిస్ అవార్డుతో సత్కరించబడ్డారు.  

తూర్పు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లో ఉన్నత విద్య మరియు సమాజ అభివృద్ధికి చేసిన విశేషమైన కృషికి ఈ అవార్డును అందుకున్నారు.

దక్షిణాసియాలోని జేసు సభ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు గురుశ్రీ స్టానిస్లాస్ డిసౌజా గారు మ్యాజిస్ పతకాన్ని ఆయనకు అందజేయగా, రోమ్‌కు చెందిన గురుశ్రీ జోసెఫ్ క్రిస్టీ ఫలకాన్ని అందజేశారు.

అవార్డును అందుకున్నప్పుడు, గురుశ్రీ రాజ్ గారు మాట్లాడుతూ, “ఒక అవార్డు ప్రజల ప్రశంసలను ప్రతిబింబిస్తుంది మరియు గతంలో సాధించిన దాని యొక్క గుర్తింపును ప్రతిబింబిస్తుంది మరియు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందడానికి కృషిని కొనసాగించడానికి ఇది ఆహ్వానం అని అన్నారు.


ఆయన  జేసు సభ గురువుగా  50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అవార్డు అందించడం జరిగింది. ఆయన జనవరి 2, 1974న పాట్నాలో తన గురు శిక్షణను ప్రారంభించాడు. కళాశాలల ప్రిన్సిపాల్‌లు, వైస్ ఛాన్సలర్‌లు, ప్రొఫెసర్లు మరియు పూర్వ విద్యార్థులతో పాటు ప్రేక్షకుల నుండి పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తాయి.
 

Article by: S. Pradeep