బయోమెడికల్ ఎథిక్స్ పై భారతదేశ నైతిక వేదాంతవేత్తల సమావేశం

హైదరాబాద్ అగ్రపీఠం, సికింద్రాబాద్‌లోని సత్యోదయంలో అక్టోబరు 18 నుండి 20 వరకు  అసోసియేషన్ ఆఫ్ మోరల్ థియాలజియన్స్ ఆఫ్ ఇండియా వారి 34వ వార్షిక సమావేశం జరిగింది.

దేశవ్యాప్తంగా 60 మంది వేదాంతవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు

మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో బయోమెడికల్ ఎథిక్స్: భారతీయ దృష్టాంతంలో అభివృద్ధి మరియు సవాళ్లు అనే నేపథ్యంపై దృష్టి సారించారు.

ఆరోగ్య సంరక్షణ సంబంధిత నైతిక సమస్యలపై లోతైన చర్చలు కూడా జరిగాయి. 

లక్నో పీఠాధిపతులు మహా పూజ్య జెరాల్డ్  జాన్ మథియాస్ ఈ సదస్సును ప్రారంభించగా, వరంగల్ పీఠకాపరి మహా పూజ్య ఉడుమల బాలా గారు ఈ కార్యక్రమం ముగిసింది. 

ఆస్టర్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ పి. రంగనాధం ముఖ్యోపన్యాసం చేస్తూ, వైద్య విధానంలో నైతిక ప్రమాణాలు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, రోగులకు సేవ కాకుండా వ్యాపారంగా చూస్తున్నారని అన్నారు. 

అందుబాటు ధరలో ఆరోగ్య సంరక్షణకు సహకారాన్ని అందిస్తున్న ప్రభుత్వ ఆయుష్మాన్ పథకాన్ని ఆయన ప్రశంసించారు.

సహాయక పునరుత్పత్తి సాంకేతికతలు, సరోగసీ, యూథంసియా,ప్రాణాంతకమైన రోగులకు జీవిత మద్దతు ఉపసంహరణ మరియు మెడికల్ టూరిజంతో సహా అనేక రకాల అంశాలను సమావేశంలో చర్చించారు.

అవయవ దానం, లింగమార్పిడి సమస్యలు, మానసిక ఆరోగ్యం మరియు ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేధస్సు వంటి అంశాలలో నైతిక సమస్యలను కూడా పరిశీలించారు.

ఈ కార్యక్రమం భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో పెరుగుతున్న నైతిక సవాళ్లను దృష్టికి తీసుకురావడమే కాకుండా, నైతిక వేదాంతవేత్తలకు సహకారంతో పరిష్కారాలను అన్వేషించడానికి వేదికను అందించింది. 

భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ అభివృద్ధి చెందుతున్నందున, ఈ సమావేశం నుండి చర్చలు ముందుకు సాగడానికి నైతిక పద్ధతులను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.