దేవుని ప్రేమ మార్గంలో కలిసి నడుద్దాం - పోప్ లియో XIV

దేవుని ప్రేమ మార్గంలో కలిసి నడుద్దాం - పోప్ లియో XIV

శ్రీసభకు నూతన నాయకుడుగా పరిశుద్ధ పోప్ లియో XIV గారు అధికారికంగా తన పరిచర్యను సంతోషకరమైన రీతిలో ప్రారంభించారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో మే 18 ఆదివారం నాడు "పరిశుద్ధ పోప్ లియో XIV" గారు తన మొదటి దివ్యబలి పూజను  సమర్పించారు.

ఈ వేడుకకు అధికసంఖ్యలో విశ్వాసులు హాజరయ్యారు. వారిలో వివిధ మతాలకు చెందిన యూదు, ముస్లిం, హిందూ, బౌద్ధ, సిక్కు, జొరాస్ట్రియన్ మరియు జైనుల ప్రతినిధులు ఉన్నారు.

ఈ వేడుకలో పోప్ లియో XIV గారు పాలియం(Pallium)ను అందుకున్నారు. మొదటి పోప్‌కు అప్పగించబడిన విధిని సూచిస్తూ, శ్రీసభ విశ్వాసాన్ని ధ్రువీకరిస్తూ మత్స్యకారుని ఉంగరం(Ring of the Fisherman)ను కార్డినల్ లూయిస్ ఆంటోనియో టాగ్లే (Luis Antonio Gokim Tagle) గారు పోప్ లియో XIV గారికి ధరింపజేశారు.

ఈ సందర్భముగా పోప్ లియో XIV గారు మాట్లాడుతూ "దేవుని ప్రేమ మార్గంలో మీతో పాటు నడుస్తున్నాను, ఎందుకంటే మనమందరం ఒకే కుటుంబంలో ఐక్యంగా ఉండాలని దేవుడు  కోరుకుంటున్నాడు." అని అన్నారు. మరియు నేను మీ విశ్వాసానికి మరియు మీ ఆనందానికి సేవకుడిగా ఉండాలని కోరుకునే ఒక సోదరుడిగా మీ వద్దకు వస్తున్నాను అని అన్నారు.

చివరిగా "మనందరం కలిసి, ఒకే ప్రజలుగా, సోదరులుగా మరియు సోదరీమణులుగా, మనం దేవుని వైపు నడుద్దాం మరియు ఒకరినొకరు ప్రేమిద్దాం"అని పోప్ లియో XIV గారు అన్నారు.
ఆద్యంతం కన్నుల పండుగగా ఈ కార్యక్రమం జరిగింది.

Article by Mk swaroop