“మీ ప్రార్థనలు, మద్దతు నాకు ఎంతో బలాన్నిచ్చాయి” – పోప్ లియో XIV

“మీ ప్రార్థనలు, మద్దతు నాకు ఎంతో బలాన్నిచ్చాయి” – పోప్ లియో XIV

“మీ ప్రార్థనలు, మద్దతు నాకు ఎంతో బలాన్నిచ్చాయి” – పోప్ లియో XIV


తన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులందరికీ  పరిశుద్ధ లియో పాపు గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో నిర్వహించిన సంప్రదాయ ఏంజెలస్ ప్రార్థన అనంతరం ఆయన మాట్లాడుతూ, “గత కొన్ని రోజులుగా నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ మద్దతును నేను నిజంగా అనుభవించాను. మీ అందరికీ కృతజ్ఞతలు” అని అన్నారు.

వాటికన్ న్యూస్ ప్రచురించిన కథనం ప్రకారం, పరిశుద్ధ లియో పాపు గారు తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రజల ప్రేమను, మద్దతును హృదయపూర్వకంగా గుర్తుచేసుకున్నారు. 

ఊపిరితిత్తిలో క్యాన్సర్ కణితిని తొలగించేందుకు శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం ఆసుపత్రి నుంచి విడుదలైన పరిశుద్ధ లియో పాపు గారు, ఆదివారం తొలిసారిగా బహిరంగంగా విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన తిరిగి ప్రజల ముందుకు రావడంతో సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో సమావేశమైన వేలాది మంది భక్తులు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. 

రోమ్‌లోని జెమెల్లీ ఆసుపత్రిలో తనకు చికిత్స అందించిన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి పరిశుద్ధ లియో పాపు గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తన ఆరోగ్య సంరక్షణ కోసం వారు చేసిన సేవలను ఆయన అభినందించారు.

“ఈ అనుభవం అనారోగ్యంతో బాధపడుతున్నవారితో, శారీరక అస్వస్థతలను ఎదుర్కొంటున్నవారితో నాకు మరింత సాన్నిహిత్యాన్ని కలిగించింది” అని పరిశుద్ధ లియో పాపు గారు పేర్కొన్నారు. అనారోగ్యం ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి పరిస్థితులను తీసుకువస్తుందో తన అనుభవం ద్వారా మరింతగా అర్థం చేసుకోగలిగానని ఆయన సందేశం స్పష్టం చేసింది.

పోపరిశుద్ధ లియో పాపు గారి  శస్త్రచికిత్సకు ముందు, పోప్ యొక్క బహిరంగ కార్యకలాపాలను సమన్వయం చేసే పాపల్ హౌస్‌హోల్డ్ ప్రిఫెక్చర్, అక్టోబర్ 20, మంగళవారం వరకు పరిశుద్ధ లియో పాపు గారి  యొక్క అన్ని సమావేశాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.


పరిశుద్ధ లియో పాపు గారు  అక్టోబర్ 13న రోమ్‌లోని జెమెల్లీ ఆసుపత్రిలో చేరారు. ఆయన కుడి ఊపిరితిత్తి దిగువ భాగంలో ఉన్న క్యాన్సర్ కణితిని తొలగించేందుకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు.

వైద్య పరీక్షల అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉండటంతో అక్టోబర్ 17న ఆసుపత్రి నుంచి విడుదల చేశారు. అనంతరం ఆయన వాటికన్‌కు తిరిగి చేరుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం తన సాధారణ కార్యక్రమాలను తిరిగి చేపట్టే విషయంలో వైద్యుల సూచనలను అనుసరిస్తూ ముందుకు సాగనున్నట్లు ఆయన సందేశం తెలియజేసింది.

Article and Design BY M Kranthi Swaroop

Telugu Survey Popup Image