దేవుని ప్రేమను గాయపడిన ప్రజలకు చూపించండి - పొప్ ఫ్రాన్సిస్ గారు

 దేవుని ప్రేమను గాయపడిన ప్రజలకు చూపించండి - పొప్ ఫ్రాన్సిస్ గారు

నగరాల్లో పనిచేయడానికి అంకితమైన ఫ్రెంచ్ మిషనరీ లతో మహా పూజ్య  పోప్ ఫ్రాన్సిస్ గారు సమావేశమయ్యారు. నిస్వార్థమైన సేవతో గాయపడ్డ నగరాల ప్రజలలో  దేవుని ప్రేమను మరియు కరుణను తెలియజేస్తున్నా వారి ప్రయత్నాలను ప్రశంసించారు.

గురువారం నాడు ఫ్రాన్స్‌కు చెందిన క్యాథలిక్ సంస్థ "మిషనరీ ఫ్రాటెర్నిటీ ఆఫ్ ది సిటీస్"(French missionary fraternity) తో మహా పూజ్య  పోప్ ఫ్రాన్సిస్ గారు  సమావేశమయ్యారు.  వారి  తీర్థయాత్రలో భాగంగా రోమ్‌ను సందర్శించిన  సందర్భముగా ఈ సమావేశం జరిగింది.

ఈ మిషనరీలు నగరాల్లోని అట్టడుగు మరియు వెనుకబడిన ప్రాంతాల చెందిన  ప్రజలకు సేవ చేస్తారు. అణగారిన  ప్రజలకు మతపరమైన సంరక్షణ మరియు సువార్త సందేశాన్ని అందించడానికి వీరు ప్రయత్నిస్తారు.


మహా పూజ్య  పోప్ ఫ్రాన్సిస్ గారు వారితో మాట్లాడుతూ "బాలయేసు జనన దృశ్యాన్ని గమనించవలసిందిగా పోప్ వారిని కోరారు." పశువుల పాకలో బాల యేసు జన్మించారు అని,  దేవుడు రక్షణ యొక్క సువార్తను ముందుగా పేదవారు, గొర్రెల కాపరులకు ప్రకటించాలని ఎంచుకున్నాడు అని అన్నారు. వారు పేదవారు కానీ మంచి హృదయం  కలిగి ఉన్నారు," అని  పోప్ ఫ్రాన్సిస్ గారు అన్నారు.

గొర్రెల కాపరులకు ప్రకటించిన అదే సంతోషకరమైన సువార్త ప్రకటనను పట్టణ నివాసులకు మీ ద్వారా అట్టడుగున ఉన్న ప్రజలకు మీరు తెలియజేస్తున్నారు అని,  దేవుని  సువార్తను అందిస్తూ మీరు చేసే సేవ గొప్పదని, ఇతరుల దైనందిన జీవితంలో భాగస్వామ్యం కావడానికి మన ఖచ్చితత్వాన్ని విడిచిపెట్టడానికి భయపడకూడదని ఆయన అన్నారు.

పోప్ ఫ్రాన్సిస్ మిషనరీలను వారు సేవ చేసే వివిధ  ప్రాంతాలలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించమని ఆహ్వానించారు. దేవుడు ఎల్లప్పుడూ సహనంతో ఉంటాడని,  "కనికరంగల దేవుని ప్రేమను గాయపడిన ప్రజలకు  చూపించమని  మిషనరీలను పోప్ ఫ్రాన్సిస్ గారు కోరారు.