జాతీయ సమాలోచన సభ్యులను ఏర్పాటు చేసిన సి సి బి ఐ

భారత కతోలిక  పీఠాధిపతుల సమాఖ్య (CCBI)  1 అక్టోబర్ 2024 న సామూహిక పనిని పెంచే లక్ష్యంతో వారి ఒకొక్క విభాగానికి ఐదుగురు జాతీయ సమాలోచన సభ్యులను ఏర్పాటు చేసింది.

సెప్టెంబర్ 10-11, 2024లో జరిగిన CCBI 95వ కార్యనిర్వాహక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోబడింది.

CCBI వారు సంవత్సరకాల పాస్టోరల్ ప్లాన్ సంప్రదింపుల నుండి వచ్చింది ఈ సమాలోచన సభ్యుల ఏర్పాటు,  ఇందులో భారతదేశంలోని 5,000 మంది కతోలిక శ్రీసభ సభ్యులు అనగా పీఠాధిపతులు, మతాధికారులు, మత పెద్దలు మరియు దైవప్రజలు పాల్గొన్నారు.

"2033 నాటికి శ్రీసభ ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడో  దాని కొరకు పని పనిచేయుటకు సీసీబీఐ జాతీయ సమాలోచన సభ్యులను ఏర్పాటు చేయడం జరిగింది.

"గతంలో ఒక కార్యనిర్వాహక కార్యదర్శి, ఒక అధ్యక్షులు మరియు ఇద్దరు బిషప్లతో కూడిన   బృందంగా ఉన్న ప్రతి విభాగంలో ఇప్పుడు ఐదుగురు అదనపు సభ్యులు ఉంటారు.

పాస్టరల్ ప్లాన్ అమలును పర్యవేక్షించడానికి మరియు నూతన జాతీయ సమాలోచన సభ్యులు  సమర్థవంతంగా పనిచేసేలా చూసేందుకు CCBI క్రియాశీలక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది.

ఈ క్రియాశీలక బృందాన్నికి అధ్యక్షులుగా ఉడిపి మెట్రానులు మహా పూజ్య ఐజాక్ లోబో గారు, సీసీబీఐ అసోసియేట్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ గురుశ్రీ డాక్టర్ క్రిస్టఫర్ విమల్‌రాజ్ సమావేశ నిర్వాహకులుగా వ్యవహిరించనున్నారు.