ఘనంగా జరిగిన సిగ్నిస్ ఇండియా నేషనల్ అసెంబ్లీ - 2025

ఘనంగా జరిగిన సిగ్నిస్ ఇండియా నేషనల్ అసెంబ్లీ - 2025
ఘనంగా జరిగిన సిగ్నిస్ ఇండియా నేషనల్ అసెంబ్లీ - 2025 సిగ్నిస్ ఇండియా వారి వార్షిక జాతీయ అసెంబ్లీ (సినా) 2025 , ఫిబ్రవరి 18 నుండి 20 వరకు హైదరాబాద్ లోని మోంట్ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ (MSI) నందు ఘనంగా జరిగింది.
హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహా పూజ్య అంతోని పూల గారు మరియు ఏలూరు పీఠాధిపతులు ,విశాఖ అతిమేత్రసన పాలనాధికారి మహా పూజ పొలిమేర జయరావు గారు ప్రారంభ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
జాతీయ అధ్యక్షుడు గురుశ్రీ విక్టర్ విజయ్ లోబో మరియు తెలుగు రీజియన్ అధ్యక్షులు గురుశ్రీ పప్పుల సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జీవితకాల సాఫల్య పురస్కారాల(Lifetime Achievement Award) కింద యెనలేని సేవలందించిన సభ్యులకు అవార్డును ప్రధానం చేసారు . తెలుగు విభాగం నుండి శ్రీ MD. విన్సెంట్ గారికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రధానం చేసారు.ఈ కార్యక్రంలో తెలుగు రీజియన్ సెక్రటరీ శ్రీ గుర్రం ప్రతాప్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు.
రెండవరోజు వార్షిక జనరల్ బాడీ సమావేశం జరిగింది. సిగ్నిస్ ఇండియా జాతీయ అధ్యక్షుడు గురుశ్రీ విక్టర్ విజయ్ లోబో ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. అన్ని ప్రాంతాల ప్రతినిధులు తమ తమ ప్రాంతాల నివేదికలను సమర్పించారు. చర్చల తర్వాత ఫోరం రాబోయే సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళికలను కూడా రూపొందించింది. కొంతమంది కొత్త సభ్యులు హాజరయ్యారు మరియు వారిని సిగ్నిస్ అసెంబ్లీకి పరిచయం చేశారు.
ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని రేడియో వెరితాస్ ఆసియా తెలుగు సిబ్బంది ప్రత్యక్ష ప్రసారం చేశారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer