ఘనంగా జరిగిన మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్ గారి పీఠాధిపతి అభిషేక మహోత్సవం
 
  ఘనంగా జరిగిన మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్ గారి పీఠాధిపతి అభిషేక మహోత్సవం
కర్నూల్ మేత్రాసనానికి నూతన పీఠాధిపతిగా నియమితులైన మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్ గారి పీఠాధిపతి అభిషేక మహోత్సవం 24 ఏప్రిల్ 2024 న కర్నూల్ లోని లూర్దుమాత కథిడ్రల్ లో ఘనంగా జరిగింది.
సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. దివ్యబలిపూజను హైద్రాబాద్ అగ్రపీఠాధిపతి కార్డినల్ మహా పూజ్య పూల అంతోని గారితో కలిసి ఇతర పీఠాధిపతులు, కర్నూల్ మేత్రాసన గురువులు మరియు వివిధ మేత్రాసనాల గురువులు కలిసి నిర్వహించారు.
విజయవాడ పీఠాధిపతి మహా పూజ్య తెలగతోటి రాజారావు గారు దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు. కార్డినల్ మహా పూజ్య పూల అంతోని గారు, మహా పూజ్య ఉడుమల బాల గారు మరియు విశాఖ అగ్రపీఠ విశ్రాంత అగ్రపీఠాధిపతి మహా పూజ్య మల్లవరపు ప్రకాష్ గారు సమిష్టిగా నూతన పీఠాధిపతి అభిషేకించారు.
దివ్యబలిపూజ అనంతరం నూతన పీఠాధిపతి మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్ గారు తన అభిషేక మహోత్సవానికి విచ్చేసిన వారందరికి తన హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలిపారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer
 
             
     
 
   
   
   
   
  