అగస్టీనియన్లతో సమావేశమైన పోప్ లియో

సెప్టెంబర్ 15న అగస్టీనియన్ల జనరల్ చాప్టర్ ముగింపులో పోప్ లియో ఆ సభ వారితో సమావేశమయ్యారు.

ఈ సభను స్థాపించిన పునీత అగస్టీన్ కూడా తన ఆధ్యాత్మిక జీవనంలో ప్రేమ మూలాధారంగా చేసుకొని జీవించారని పోప్ గుర్తుచేశారు కనుక వారి వారి జీవితాలలో ప్రేమను మూలాధారంగా చేసుకోవాలని పోప్ అన్నారు

ప్రేమ, సేవ, సువార్తికరణ కతోలిక సంఘాలను మరింత బలోపేతం చేస్తున్నాయని.

దైవ పిలుపు హృదయాన్ని కదిలించే అందమైన పిలుపని,యువతలో దైవ పిలుపు పట్ల ఆకర్షణ కలిగించడానికి కృషి చేయాలని ఆయన కోరారు.

పదవీ విరమణ చేస్తున్న ప్రైయర్ జనరల్ Fr Alejandro Moral Antón సేవలకు కృతాగనతలు  తెలిపారు.కొత్తగా ఎన్నికైన ప్రైయర్ జనరల్ ఫా.జోసెఫ్ ఫారెల్ కు శుభాకాంక్షలు తెలిపారు.