కథోలిక మిత్రునికి రక్తదానం..

కర్నూలు మేత్రాసనం, ఆదోని విచారణ ఉపదేశి పి.ఆనంద్ కుమార్ గారు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ కర్నూలులోని గౌరిగోపాల్ హాస్పిటల్ లో చేరారు.
వైద్యులు అత్యవసరంగా బైపాస్ సర్జరీ చేయాలని సూచించగా. అందుకుగాను 7యూనిట్ల(ప్యాకెట్ల) రక్తం అవసరమని తెలియచేసారు.
పేషంట్ రక్తగ్రూపు A-positive కాగా, ఏ గ్రూపు వారైనా సరే రక్తం దానం చేస్తే అక్షయ బ్లడ్ బ్యాంక్ లో ఎక్చేంజ్ చేసుకుంటామని, పేషంట్ కు సరిపోయే రక్తాన్ని అందిస్తామని తెలిపారు.
కావున కథోలిక మిత్రులు, యువత, గురువులు, సిస్టర్లు స్పందించి ముందుకు వచ్చి రక్తదానం చేసి ఆనంద్ కుమార్ కు మరో జీవితాన్ని ప్రసాదించారు.