సెయింట్ అలోసియస్ ఆంగ్లో ఇండియన్ హైస్కూల్ ఆద్వర్యంలో బీచ్ క్లీనింగ్ డ్రైవ్
సెయింట్ అలోసియస్ ఆంగ్లో ఇండియన్ హైస్కూల్ ఆద్వర్యంలో బీచ్ క్లీనింగ్ డ్రైవ్
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సెయింట్ అలోసియస్ ఆంగ్లో ఇండియన్ హైస్కూల్ ఫాదర్స్ గురుశ్రీ మరియాదాస్, గురుశ్రీ జాకబ్ రెడ్డి గార్ల తో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు ఆదివారం ఆర్కే బీచ్ లో బీచ్ క్లీనింగ్ డ్రైవ్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఉదయం 5.45 గంటలకు ఆర్కే బీచ్ లో సమావేశమైన అనంతరం పాఠశాల సభ్యులను మూడు బ్యాచ్ లుగా విభజించారు. ఎన్టీఆర్ విగ్రహం జంక్షన్ నుంచి వైఎంసీఏ జంక్షన్ వరకు మూడు భాగాలుగా విభజించి వాటిని శుభ్రం చేసేందుకు మూడు బృందాలుగా బయలుదేరారు. ఆహార వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, వాటర్ బాటిల్స్, కప్పులు, బ్యాగులతో సహా భారీ చెత్తను తొలగించారు.
గురుశ్రీ మరియాదాస్ గారు మాట్లాడుతూ "ప్రతీ ఒక్కరు బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుకోవాలని, ప్రతీ ఒక్కరు మొక్కలు విరివిగా నాటాలి అని, భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలని కోరారు.
గురుశ్రీ జాకబ్ రెడ్డి గారు మాట్లాడుతూ " ఈ విశ్వంలోనే మనం జీవించేందుకు వీలైన ఒకే ఒక్కటి భూమి. ఇది అమూల్యమైనది. దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని, ఈ ప్రపంచం ఇంకా ముందుకు కొనసాగాలి అని, ఈ పర్యావరణం అంతా పరిశుభ్రంగా ఉంటే ప్రతి ఒక్కరు ఈ వాతావరణాన్ని ఆస్వాదించడంమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు" అని తెలిపారు ప్రకృతిని మనం ప్రేమిస్తే.. అది మానవునికి ఎంతో మేలు చేస్తుంది అని అన్నారు.
పర్యావరణ దినోత్సవంపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల బృందం బీచ్ రోడ్డులో ప్లకార్డులు, పర్యావరణ పరిరక్షణపై ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నడకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 80 మంది విద్యార్థులు, 18 మంది ఉపాధ్యాయులు, 30 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారని పాఠశాల యాజమాన్యం తెలిపింది.