సముద్రతీరాన ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్ములించేందుకు నడుము కట్టిన విద్యార్థులు

డిసెంబర్ 9న బంగ్లాదేశ్‌ పబ్లిక్ యూనివర్శిటీ ఆఫ్ రాజ్‌షాహి విద్యార్థులు సెయింట్ మార్టిన్ ఐలాండ్ బీచ్‌లో ప్లాస్టిక్ ను తొలగించేందుకు క్లీనింగ్ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సుమారు 16 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా తమ సేవను అందించారు. ఈ ద్వీపంలో క్లీనింగ్ ఆపరేషన్ సందర్భంగా, బీచ్‌లో వాకింగ్ చేస్తున్న స్థానిక పిల్లలు మరియు యువకులు కూడా విద్యార్థులతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

"పర్యాటకులకు ప్లాస్టిక్ కాలుష్యం పై అవగాహన కల్పించడం మరియు సముద్రతీరాన   శుభ్రంగా ఉంచే విధానాలు" అనే నేపథ్యంపై ఈ కార్యక్రమం ఏర్పాటుచేసారు.

బీచ్‌లో పడి ఉన్న, సముద్రం నుంచి తేలుతున్న పాలిథిన్ బ్యాగులు, ప్లాస్టిక్ బాటిళ్లతో సహా 7 పెద్ద సంచుల కాలుష్య వ్యర్థాలను సేకరించారు.

Tags