ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం

 స్వీడన్ వేదికగా 1972 లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేయబడింది. జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినంగా జరపాలని తొలిసారి ఐక్యరాజ్యసమితి ప్రకటించింద 1973 నుంచి జూన్‌ 5న ఏటా ప్రపంచ పర్యావరణ దినం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం

మానవ అభివృద్ధి పేరుతో విచక్షణా రహితంగా చెట్ల నరికివేత, ప్లాస్టిక్‌ వినియోగం, పరిశ్రమల నుంచి వచ్చే విష వాయువులు, వ్యర్థాలతో భూతాపం పెరుగుతోంది. భూమి, వాయు, జల కాలుష్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

ప్రస్తుత రోజులలో తీవ్రమైన ఎండలు, అకాల వర్షాలు, కరువు కాటకాలు, వరదలు, భూతాపం, సముద్రమట్టాల పెరుగుదల వంటి ప్రతికూల పరిస్థితులను చూస్తున్నాము. ప్రకృతిని కాపుడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా వుంది.

ప్రపంచ పర్యావరణ దినోత్సవ’ స్ఫూర్తిని ఏడాది పొడవునా ప్రదర్శిస్తూ, పచ్చదనం పెంపుదలకు, పర్యావరణ పరిరక్షణకు మనవంతు సహకారం అందించాలి. ప్రకృతిని ప్రేమించడం కంటే గొప్ప విషయం ఏముంటుంది.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer