కౌలాలంపూర్ ఆర్చ్ డియోసెస్ వారు స్థానిక ప్రకృతి పార్కులో 300చెట్లను నాటారు
కౌలాలంపూర్ ఆర్చ్ డియోసెస్ వారు స్థానిక ప్రకృతి పార్కులో 300చెట్లను నాటారు
కౌలాలంపూర్ ఆర్చ్ డియోసిసన్ క్రియేషన్ జస్టిస్ మినిస్ట్రీ (CJM) వారు "కౌలా సెలంగర్ నేచర్ పార్క్" (KSNP)లో 300 రైజోఫోరా చెట్లను నాటడం జరిగింది. వంద మందికి పైగా పర్యావరణ ఔత్సాహికులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
CJM ప్రత్యేకంగా కౌలా సెలంగోర్ నేచర్ పార్క్‌ను ఈ చెట్ల పెంపకం కార్యక్రమం కోసం ఎంచుకున్నారు. ఎందుకంటే 290 హెక్టార్ల తీరప్రాంతంలో ఎక్కువ భాగం చిత్తడి నేలలతో కూడి ఉంది.
KSNP ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అశోక్ ప్రకారం, వాస్తవానికి ఈ పార్కును గోల్ఫ్ కోర్స్‌గా మార్చాలని అనుకున్నారు. మలేషియన్ నేచర్ సొసైటీ సహకారంతో, KSNP ప్రస్తుతం దీనిని పరిరక్షిస్తోంది.దీనిని ఒక మంచి ఉద్యానవనంగా మారుస్తోంది.
ఈ సందర్భముగా కౌలాలంపూర్ ఆర్చ్ డియోసిసన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ చెట్ల పెంపక కార్యక్రమం వలన పార్క్ యొక్క సుస్థిరతను కాపాడుకోవడంలో సహాయకరంగా ఉంటుంది అని , ప్రత్యేకించి ఇందులో 150 కంటే ఎక్కువ పక్షి జాతులు ఉన్నాయి. ఆ పైన, దాదాపు 100,000 వాడింగ్ పక్షులు వారి వార్షిక వలసలపై ఈ ప్రాంతం గుండా వెళతాయి అని KSNP వాళ్ళు తెలిపారు.
మొక్కలు నాటే కార్యక్రమంలో పర్యావరణ ప్రేమికులు రెండు బృందాలు కలిసి మొక్కలు సిద్ధం చేసి నాటారు.కౌలాలంపూర్ అగ్రపీఠ యువత చురుకుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ జూలైలో కౌలాలంపూర్ ఆర్చ్ డియోసెస్ యొక్క మతాధికారుల స్మృతి సందర్భంగా, పూజారులు తమ తమ పారిష్‌లలో చెట్లను పెంచే ప్రచారాన్ని ప్రోత్సహించడానికి మొక్కలను విచారణ విశ్వాసులకు అందించారు.