“వలసదారులు మనకు ఆశాభావాన్ని నేర్పుతారు" అన్న పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్

అక్టోబరు 28 ,2024  న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు స్కాలాబ్రినియన్ మిషనరీలను కలిసారు.\

పేదరికం, అన్యాయాలు, యుద్ధాల నుండి పారిపోతున్న వలసదారులను స్వాగతించాలి, వారితో కలిసి ఉండాలి, ప్రోత్సహించాలి మరియు సమగ్రపరచాలని, వారి అవసరం మనకు ఉందని గుర్తుంచుకోవాలి.

ప్రపంచంలో శరణార్థులు మరియు వలసదారుల విధికి విస్తృతమైన "ఉదాసీనత" మరియు వారిపై పెరుగుతున్న శత్రుత్వం, వలస సవాళ్లకు కరుణతో కూడిన ప్రతిస్పందన కోసం ఫ్రాన్సిస్ పాపు గారు విజ్ఞప్తిని పునరుద్ఘాటించారు.

"వలసదారులు తప్పనిసరిగా స్వాగతించబడాలి, వారికి తోడుగా ఉంటూ వారిని ప్రోత్సహిస్తూ, సమగ్రపరచాలి " అని పాపు గారు సోమవారం నాడు వారి 16వ జనరల్ సాధారణ చాప్టర్ సందర్భంగా స్కాలాబ్రినియన్లుగా పిలవబడే సెయింట్ చార్లెస్ బోరోమియోతో సమావేశమైనప్పుడు తెలిపారు .

ఈ సభ 2024లో  "నిరీక్షణ యాత్రికులు" అనే నేపధ్యాన్ని 2025 జూబ్లీ కొరకు ఎంచుకుంది.

వలసదారుల నిరీక్షణ యొక్క సద్గుణాలు, మతసంబంధ సంరక్షణ, దాతృత్వం వారి  పరిచర్యలోని మూడు అంశాలు ఉన్నాయని పాపాలు గారు ఈ నెపథ్యం పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు  

వలసదారులు మెరుగైన జీవితాన్ని పొందాలనే ఆశతో తమ ఇళ్లను విడిచిపెడతారు, తరచుగా తిరస్కరణను ఎదుర్కొంటారు కానీ నిరాశకు లోనవుతారు.

"దూరమైన కుటుంబ సభ్యుల పట్ల వారికి ఉన్న ప్రేమ చాలా గొప్ప విషయాలను నేర్పుతుంది" అని పోప్ చెప్పారు.

స్కాలాబ్రినియన్ల స్థాపకుడు పునీత జాన్ బాప్టిస్ట్ స్కాలాబ్రిని గారు.

వలస వెళ్ళాలనే కోరిక తరచుగా మోక్షం కొరకు లోతైన వాంఛను ప్రతిబింబిస్తుందని పేర్కొన్న పోప్ ఫ్రాన్సిస్, దాని సవాళ్లు ఉన్నప్పటికీ, వలసలు "విశ్వాసం మరియు మానవత్వం యొక్క విలువైన విద్యాలయం" అని వ్యాఖ్యానించారు.

పోప్ ఫ్రాన్సిస్ ఇటలీతో సహా అనేక దేశాలలో తగ్గుతున్న జననాలు, వృద్ధాప్య జనాభా ఎదుర్కొంటున్నందున వలసదారులు అవసరమని గుర్తించారు

ఆకలి మరియు వేధింపుల నుండి పారిపోయి జీవించడానికి పోరాడుతున్న వలసదారులు అనేక మంది జీవితాలను కోల్పోవడం మరియు దోపిడీకి గురికావడం పట్ల ఉదాసీనతను ఆయన మరోసారి ఖండించారు.


ప్రస్తుత సందర్భంలో "ప్రతి వ్యక్తి గౌరవం మరియు హక్కులను ధృవీకరించే ధార్మిక పనుల ద్వారా" న్యాయం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.

చివరిగా ,తరచుగా అన్యాయాలు, యుద్ధాలు, స్వదేశాలలో అవకాశాలు లేకపోవడం, మరియు సరిహద్దులను మూసివేయడం ద్వారా తమ ఇళ్లను విడిచిపెట్టవలసి వచ్చిన వలసదారుల పట్ల దాతృత్వం కొరకు పాపు గారు పిలుపునిచ్చారు.