సెయింట్ చార్బెల్ సమాధి ఎదుట ప్రార్దించిన పోప్ లియో

ప్రతి ఏటా వేలాది మంది యాత్రికులు, క్రైస్తవులు మరియు ముస్లింలు సెయింట్ చార్బెల్ సమాధి వద్ద ప్రార్థన చేయడానికి లెబనాన్‌లోని అన్నయాకు వెళతారు.

లెబనాన్‌లో తన అపోస్టోలిక్ సందర్శన రెండవ రోజు ప్రణాళికలో భాగంగా పోప్ లియో ఈ సమాధిని సందర్శించారు.

ఈ ప్రాంతంలో అత్యంత గౌరవప్రదమైన వ్యక్తులలో ఒకరైన సెయింట్ చార్బెల్ అవశేషాలు అక్కడ ఉన్నాయి.

పొప్ ఫ్రెంచ్ లో మాట్లాడుతూ పునీత చార్బెల్ గురువులకు పీఠాధిపతులు తమ దైవ పిలుపులో, సువార్త ప్రచారంలో ప్రాధాన్యతను వివరించారు. 

పునీత చార్బెల్ తన వినయంద్వారా క్రైస్తవులందరికీ ఒక సందేశంగా మిగిలారు 

దైవాంకితులకు ఈయన ఒక సుమాతృకగా నిలిచారు.