వృద్ధులు మన జ్ఞాననిధులన్న పోప్ లియో

టర్కికి  మొదటి అపోస్టోలిక్ ప్రయాణంలో రెండవ రోజున ఇస్తాంబుల్‌లోని లిటిల్ సిస్టర్స్ ఆఫ్ ది పూర్స్ నర్సింగ్ హోమ్‌ను పోప్ లియో సందర్శించారు.

టర్కి నగరంలోని హోలీ స్పిరిట్‌ కథడ్రల్ లో ప్రార్థన తర్వాత, పోప్ ప్రణాళికలో భాగంగా  రెండవ గమ్యస్థానం ఈ సందర్శన.

అక్కడికి చేరుకున్న తర్వాత, ప్రతి నివాసిని ఆప్యాయతతో పలకరించారు.మఠకన్యలు చేస్తున్న సేవను పోప్ ప్రశంశించారు.

మనం ఇతరులతో సాన్నిహిత్యంగా ఉండడానికి ముందుగా వారి కోసం ఎంచేయడానికి సిద్ధంగా ఉండాలి 

అక్కడ నివసించే మరియు లిటిల్ సిస్టర్స్ సంరక్షణ పొందుతున్న వృద్ధులందరికీ ఆయన కొన్ని మాటలు అంకితం చేశారు, వారు తమ జీవితమంతా ఈ మిషన్‌కు అంకితం చేస్తారు.

పవిత్ర గ్రంథం మనకు మంచి సంప్రదాయాలను బోధిస్తాయి.

వృద్ధులు వారి కుటుంబాలకు మరియు తమ సమాజానికి ఒక జ్ఞాననిధి అని పోప్ ఫ్రాన్సిస్ అన్న మాటలను పోప్ లియో గుర్తుచేశారు 

పోప్ లియో మరోసారి ప్రపంచంలోని అత్యంత దుర్బల పరిస్థితుల్లో ఉన్న వారి గురించి ఆందోళనను వ్యక్తం చేశారు.