వాటికన్‌లో అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్ ప్రతినిధులను స్వాగతించిన పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్
అక్టోబరు 28,2024 న పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్ గారు వాటికన్‌లోని అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్ ప్రతినిధి బృందాన్ని స్వాగతించి, మానవ సౌభ్రాతృత్వంలో కలిసి నడవడానికి వారిని ప్రోత్సహించారు.
అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబి, ఒక ప్రార్థనా మందిరం, దేవాలయము మరియు మసీదును కలిగి ఉన్న ఒకే సముదాయం.
ఈ విశిష్ట నిర్మాణం,2023 ప్రారంభంలో మతాంతర సహజీవనం మరియు సామరస్య జీవనాన్ని ప్రత్సాహించేందుకు ప్రారంభించబడింది.
ప్రపంచ శాంతి మరియు మానవ సౌభ్రాతృత్వంపై చారిత్రాత్మక 2019 డాక్యుమెంట్‌లో దీనిగురించి పేర్కొన్నారు.
డాక్యుమెంట్‌లో పేర్కొన్నట్లు అబ్రహమిక్ ఫ్యామిలీ హౌస్ అధ్యక్షుడు మొహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ నేతృత్వంలోని వారి ప్రయత్నాలకు ప్రతినిధి బృందానికి పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్ గారు ధన్యవాదాలు తెలిపారు.
అరేబియా ద్వీపకల్పాన్ని సందర్శించిన మొదటి పోప్‌గా 2019 ఫిబ్రవరిలో పోప్ ఎమిరేట్స్‌కు చేసిన చారిత్రాత్మక సందర్శన తర్వాత ఫలవంతమైన అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్, మానవ సౌభ్రాతృత్వంపై డాక్యుమెంట్‌లో పేర్కొన్న సూత్రాలను కలిగి ఉంది.
అబుధాబిలోని సాదియత్ కల్చరల్ జిల్లాలో ఉన్న అబ్రహమిక్ ఫ్యామిలీ హౌస్ అభ్యాసానికి, చర్చలకు, విశ్వాసానికి కేంద్రం.
హిజ్ ఎమినెన్స్ అహ్మద్ అల్-తాయెబ్ మసీదు, సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చి, ఇది సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసికి అంకితం చేయబడింది మరియు మోసెస్ బెన్ మైమోన్ సినాగోగ్‌ని ఆవరించి ఉన్న మూడు ఆరాధన మందిరాలు.