మానవ సౌభ్రాతృత్వ సమావేశంలో పాల్గొన్నవారిని కలిసిన పోప్

2025 సెప్టెంబర్ 12న వాటికన్‌లోని Sala Clementinaలో మూడవ ప్రపంచ మానవ సౌభ్రాతృత్వ సమావేశం పాల్గొన్నవారిని పొప్ లియో కలిసారు 

ప్రస్తుతం సంఘర్షణ, విభజనలతో నిండిన ప్రపంచంలో, శాంతి, సౌభ్రాతృత్వాని సమర్థిస్తూ  యుద్ధానికి  వ్యతిరేకించాలని పోప్ అన్నారు 

యుద్ధం ఎప్పటికీ పరిష్కారం కాదని పోప్ ఫ్రాన్సిస్ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు.

యదార్థమైన సయోధ్యను సాధించడానికి, అది కేవలం బహిర్గత చర్యలకు మాత్రమే పరిమితం కాకూడదు, కానీ అది మన అంతర్గత విలువల్లో ఒక భాగం కావాలి.

ప్రతిరోజు మనం ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నాం, వారిని సోదరసోదరీమణులుగా చూస్తున్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.

ఈ ఆలోచనను మన హృదయంలోకి తీసుకున్నప్పుడు, అది మన ప్రతి చర్యను, ఆలోచనను ప్రభావితం చేస్తుంది.

ప్రపంచ సమస్యలకు మౌనం పరిష్కారం కాదని, ధైర్యం, మరియు సాన్నిహిత్యమే ప్రపంచానికి సమాధానమని ఉద్ఘాటించారు. 

వృద్ధి, అభివృద్ధి నిండిన విభిన్నమైన జీవితాన్ని ఎంచుకోవడం ద్వారా ప్రపంచాన్ని మార్చవచ్చని పోప్ తెలిపారు