మాదకద్రవ్యాల వ్యాపారులు 'హంతకులు' - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

మాదకద్రవ్యాల వ్యాపారులు 'హంతకులు' -  పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

జూన్ 26న మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవాన్ని పురస్కరించుకుని, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు తన సాధారణ ప్రేక్షకులతో మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా సమస్యను ప్రస్తావించారు.

"మాదకద్రవ్యాల దుర్వినియోగం"  సమాజాన్ని పేదరికం వైపుకు నడిపిస్తుంది అని ఈ సందర్భముగా  ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.  పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మాట్లాడుతూ ఇది మానవ బలాన్ని మరియు నైతిక ధైర్యాన్ని తగ్గిస్తుంది అని , మరియు మెరుగైన సమాజానికి జీవించాలనే కోరికను నాశనం చేస్తుంది." అని అన్నారు.

 ప్రతి మాదకద్రవ్య వ్యసనపరుడు " వ్యక్తిగత కథను కలిగి ఉంటాడు అని, అలంటి వారిని ఆదరించి వారితో మాట్లాడాలని, వారి బాధను తప్పనిసరిగా వినాలి అని , వారిని అర్థం చేసుకోవాలి, ప్రేమించాలి మరియు వీలైనంత వరకు వారిని స్వస్థపరచాలి అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఉద్ఘాటించారు.

అయితే,  డబ్బు సంపాదించాలనే చెడు ఉద్దేశాలుతో డ్రగ్ డీలర్లు మరియు వాటిని సరఫరా చేసే వారి పనులు క్షమించరానివి అని, వారు హంతకులు వంటి వారు అని అన్నారు ."

ప్రస్తుత రోజులలో  వివిధ కారణాల వల్ల యువత డ్రగ్స్‌ బారిన పడుతున్నారు అని ,
"మాదకద్రవ్యాలకు బానిసలైన వారు మరియు వారి కుటుంబాల గురించి చాలా విషాద కథలు ఎన్నో వింటున్నాము అని ఈ ప్రమాదకరమైన మాదకద్రవ్యాల ఉత్పత్తి మరియు అక్రమ రవాణాకు ముగింపు పలకడం నైతిక బాధ్యత అని నేను నమ్ముతున్నాను" అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer