మఠవాసుల త్యాగాన్ని ప్రశంసించిన పొప్ లియో

సోమవారం సెప్టెంబర్ 22 న హోలీ ల్యాండ్ నుండి నిష్పాదక కార్మెల్ సభ బృందాన్ని, అలాగే Saint Catherine, Virgin and Martyr , Salesian Missionaries of Mary Immaculate; మరియు Saint Paul of Chartres మఠకన్యలతో పొప్ లియో సమావేశమైయ్యారు
మఠకన్యలను అసాధారణ మహిళలుగా పొప్ లియో అభివర్ణించారు ఎందుకంటె కష్ట సమయాలలోను,సమాజంలో అత్యంత నిర్లక్ష్యం చేయబడిన వారితో,అవసరంలో ఉన్నవారికి దగ్గరగా ఉండటంలో మరియు యుద్ధ వల్ల క్రూరమైన హింసను అనుభవించిన వారికి తోడుగా ఉన్నారు
మన శ్రీసభలో ఏంటో మంది మహిళల ధైర్యాన్ని పోప్ గుర్తుచేసుకున్నారు . వారు అనేక మందికి మార్గం సుగమం చేశారు మరియు నేడు ఎంతోమంది మహిళలకు నిదర్శనముగా ఉన్నారు.
దేవునిపై మీ విశ్వాసాన్ని నిరూపించుకోవడంతో మరియు శాంతి కోసం మీ నిరంతర ప్రార్థనతో ద్వేషం మరియు హింసతో నలిగిపోయే ప్రదేశాలలో మీ జాగరూకత మరియు నిశ్శబ్ద ఉనికితో ప్రదర్శిస్తున్నారు అని పవిత్ర భూమికె చెంది నిష్పాదక కార్మెల్ సభ్యులను పోప్ ప్రశంసించారు
"చాలా దేశాలలో మరియు చాలా సందర్భాలలో వారు చేసే సేవకు" వారికి కృతజ్ఞతలు తెలుపుతూ పోప్ ముగించారు మరియు ప్రపంచంలోని మఠకన్యలకు తన ప్రార్థనా హామీ ఇచ్చారు.