పోప్ లియోని కలిసిన ఇటాలియన్ నటుడు రాబర్టో బెనైని

ఆస్కార్ అవార్డు విజేత ఇటాలియన్ నటుడు మరియు దర్శకుడు Roberto Benigni’ గురువారం డిసెంబర్ 4 మధ్యాహ్నం అపోస్టోలిక్ ప్యాలెస్‌లో ఇటాలియన్ స్టేట్ టీవీ CEOలు మరియు నిర్మాతలతో కలిసి పోప్ లియో ను కలిసారు.

బెనైని వాటికన్ మీడియాతో కలిసి నిర్మించిన మరియు రోమ్‌లోని MAXXI మ్యూజియంలో ముందు రోజు ప్రదర్శించబడిన "Peter: A Man in the Wind"  ముందు పోప్ లియో ని కలిసినట్టు హోలీ సీ ప్రెస్ ఆఫీస్ ప్రకటనలో పేర్కొంది

ఈ మోనోలాగ్ నిర్మాణం నుండి అనేక సారాంశాలను చూసి, " ప్రేమ గురించి ఎంత అందంగా వివరించారు" అని పోప్  వ్యాఖ్యానించారు.

సెయింట్ పీటర్ జీవితం, Dante మరియు సెయింట్ అగస్టీన్ రచనలు,ది డివైన్ కామెడీ , ది  కన్ఫెషన్స్ మరియు మోనోలాగ్‌కు కేంద్రంగా ఉన్న ఇతివృత్తాలను వారిరువురు సంభాషించారు.

డికాస్టరీ ఫర్ కమ్యూనికేషన్ ప్రిఫెక్ట్ Paolo Ruffini; వాటికన్ మీడియా డైరెక్టర్ Stefano D’Agostini మరియు బెనిగ్ని క్రియేటివ్ టీమ్ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.