నవంబర్ మాస ప్రార్థనా ఉద్దేశాన్ని ప్రకటించిన పోప్

ఆత్మహత్య నివారణ కొరకు ఈ నవంబర్ మాసమంతా ప్రార్దిదాం అని పోప్ విశ్వశ్రీసభకు పిలుపునిచ్చారు.

ఆత్మహత్య ఆలోచనలతో నలిగిపోతున్నవారికి తమ సమాజం అవసరమైన మద్దతు, సంరక్షణ మరియు ప్రేమను పొందగలుగులాగున మరియు జీవిత విలువను తెలుసుకొనేలాగున ప్రార్దించుదాం అని పోప్ విశ్వాసులను ఆహ్వానించడంతో వీడియో ప్రారంభమవుతుంది.

చీకటిలో మరియు నిరాశతో ఉన్న వారికీ , ముఖ్యంగా ఆత్మహత్య ఆలోచనలతో పోరాడుతున్న వారిని, భారముచే అలసిసొలసిన జనులారా! నా యొద్దకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను అన్న ఆ ప్రభువును ప్రార్థిదాం పోప్ లియో  అన్నారు 

నిరాశతో ఆత్మహత్య ఆలోచనలతో ఉన్న వారిని స్వాగతించే సమాజాన్ని వారి గోడును ఆలకించి మరియు వారితో సాలిసి నడిచే సమాజాన్ని కనుగొనాలి అని పోప్ అన్నారు 

ఆ ప్రభువు మనందరికీ "శ్రద్ధ మరియు కరుణాహృదయాన్ని" ప్రసాదించాలని, "ఓదార్పు మరియు సాన్నిహిత్యాన్ని అందించగల సామర్థ్యం, ​​అలాగే అవసరమైన సహాయాన్ని అందించే లాగున మనలను దీవించాలని పోప్  ప్రార్థించారు

పోప్ లియో నవంబర్ మాస ప్రార్థనా ఉదేశాన్ని Pope Worldwide network వారు విడుదల చేశారు