దైవ వాక్కుతో ప్రార్ధించమని పిలుపునిచ్చిన పోప్
దైవ వాక్కుతో ప్రార్థించమని ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తూ, పోప్ లియో 2026 జనవరి మాస ప్రార్థన ఉద్దేశాన్ని ప్రకటించారు
“ప్రే విత్ ది పోప్” అనే నూతన శీర్షికతో తన నెలవారీ ప్రార్థన ఉద్దేశాలను విడుదల చేయనున్నారు, ప్రపంచవ్యాప్తంగా వున్నా కథోలిక విశ్వాసులు కలిసి ఈ ఉద్దేశాలు గురించి ప్రార్ధించమని ఆహ్వానించారు.
దేవుని వాక్యంతో ప్రార్ధన మన జీవితాలకు పోషణగా మరియు మన సమాజాలలో ఆశకు మూలంగా ఉండాలని ప్రార్ధిదాం.
మరింత సోదరభావంతో కూడిన మరియు ప్రేషిత శ్రీసభను నిర్మించడంలో మనకు సహాయపడాలని ప్రార్థిద్దాం.