టర్కీ క్రైస్తవ నాయకులతో సమావేశమైన పోప్ లియో

టర్కీకు అపోస్తొలిక పర్యటనలో మూడవ రోజు నవంబర్ 29 న పోప్ లియో నూరు వసంతాల క్రితం నిర్మించిన ఏకైక క్రైస్తవ ఆలయాన్ని సందర్శించారు.

ఇది Syriac Orthodox communityకి చెందినది మరియు 4వ శతాబ్దం నుండి డీకన్ మరియు చర్చి డాక్టర్ అయిన సెయింట్ Ephrem of Syriaకు అంకితం చేయబడింది.

ఈ దేవాలయంలో వివిధ క్రైస్తవ వర్గాల నుండి అనేక మంది నాయకులు పోప్ కొరకు వేచి ఉన్నారు.

Syriac Orthodox Patriarch and the Patriarch of Constantinople, మొదటి Bartholomew పోప్‌కు స్వాగతం పలికారు. అనంతరం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది 

ఈ సమావేశం గురించి వివరాలు వెల్లడింపబడలేదు, ఎందుకంటే ఇది పూర్తిగా రహస్య సమావేశంగా పరిగణించబడింది.

పోప్ లియోతో సహా ప్రతి నాయకుడు ప్రసంగించారని తెలిసింది.