జీవిత పరిరక్షణ కవాతును ప్రశంసిస్తూ లేఖ పంపిన పోప్

జనవరి 23న జరిగిన 'March For Life లో పాల్గొన్న వారందరికీ ప్రశంసలు తెలియజేస్తూ,  తన అపోస్తలిక ఆశీర్వాదాన్ని అందిస్తూ ఒక వ్యక్తిగత లేఖను పోప్ లియో రాశారు.

తన లేఖలో పోప్ తన దౌత్య బృందంతో ఇటీవల జరిగిన సమావేశం గురించి ప్రస్తావిస్తూ, జీవితపు హక్కు మరియు పవిత్రత గురించి తెలియచేసారు 

జీవిత హక్కును పరిరక్షించడం అనేది ప్రతి ఇతర మానవ హక్కుకు అనివార్యమైన పునాది.

ఒక సమాజం మానవ జీవిత పవిత్రతను కాపాడి, దానిని ప్రోత్సహించడానికి చురుకుగా కృషి చేసినప్పుడు మాత్రమే అది నిజంగా పురోగమిస్తుంది అని పోప్ అన్నారు.

“జీవితం దాని అన్ని దశలలో గౌరవించబడేలా చూడటానికి నిరంతరం కృషి చేయాలని” పోప్, మద్దతుదారులను, ముఖ్యంగా యువతను ప్రోత్సహించారు. 

అమెరికా సంరక్షకురాలైన నిష్కళంకమాత మధ్యవర్తిత్వానికి కోరుతూ పోప్ లేఖను ముగించారు.

Roe v. Wade. నిర్ణయం ద్వారా యునైటెడ్ స్టేట్స్ అంతటా గర్భస్రావం చట్టబద్ధం అయిన ఒక సంవత్సరం తర్వాత, 1974 నుండి ప్రతి సంవత్సరం వాషింగ్టన్, డి.సి.లో మార్చ్ ఫర్ లైఫ్ నిర్వహించబడుతోంది.

సంవత్సరాలుగా, చాలా మంది పోప్‌లు వివిధ మార్గాల్లో ఈ మార్చ్‌కు తమ మద్దతును తెలియజేశారు.

16 వ బెనెడిక్ట్ పోప్ 2013లో మార్చ్ ఫర్ లైఫ్‌కు తన మద్దతును ట్వీట్ చేస్తూ,  ప్రార్థనల ద్వారా "జీవితం కోసం కవాతు చేస్తున్న వారందరితో దూరం నుండి కలుస్తున్నట్లు" తెలిపారు.

2023లో పోప్ ఫ్రాన్సిస్ Arlington బిషప్ Burbidge ద్వారా మార్చ్‌కు మద్దతు మరియు ఆశీర్వాద సందేశాన్ని అందించారు.