క్రైస్తవ సమైక్యత ప్రార్థన వారాన్ని ప్రారంభించిన పోప్

ఈ జనవరి 18 న 126వ క్రైస్తవ సమైక్యత ప్రార్థన వారంలో మొదటి రోజు.

ఈ సంవత్సరం క్రైస్తవ సమైక్యత ప్రార్థన శీర్షిక పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ నుండి తీసుకోబడింది, అది" శరీరం ఒకటే. ఆత్మయు ఒకటే.మిమ్ము దేవుడు పిలిచినదియు ఒక నిరీక్షణకే కదా" అని పోప్ అన్నారు 

Armenian Apostolic Church’s Department of Interchurch Relations వారు ఈ ప్రార్థనలు మరియు ప్రత్యేక అంశాలను తయారు చేయడానికి సమన్వయం చస్తారు.

ఈ వారమంతా కతోలిక మరియు ఇతర క్రైస్తవ  విశ్వాసులు ఐక్యత కోసం ప్రార్ధించాలని పోప్ ఆహ్వానించారు.

19వ మరియు 20వ శతాబ్దాలలో వివిధ క్రైస్తవ వర్గాలలో క్రైస్తవ ఐక్యతపై ఆసక్తి పెరిగింది.

వివిధ శాఖల మధ్య ఐక్యత కోసం ప్రార్థనను ప్రోత్సహించే ప్రముఖ పెంటెకోస్టల్, ఆంగ్లికన్ మరియు కతోలిక బోధకులతో, చివరికి క్రైస్తవ మత ఉద్యమం UK మరియు యునైటెడ్ స్టేట్స్‌లో ప్రజాదరణ పొందింది.

క్రైస్తవ సమైక్యత మూలాలు రెండు శతాబ్దాల నాటివి, మరియు 13 వ పోప్ లియో దీనిని బలంగా ప్రోత్సహించారు అని పోప్ అన్నారు