"క్రీస్తే మన నిరీక్షణ" అన్న పోప్ లియో
బుధవారం నవంబర్ 19 సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో సామాన్య ప్రేక్షకుల సమావేశంలో "క్రీస్తే మన ఆశ" అనే జూబ్లీ ఇతివృత్తంపై పోప్ లియో మాట్లాడారు.
క్రీస్తు పునరుత్థానం మరియు నేటి కొన్ని సవాళ్ల మధ్య సంబంధాన్ని, ముఖ్యంగా సృష్టి సంరక్షణకు సంబంధించిన వాటిని పోప్ లియో ప్రస్తావించారు.
క్రీస్తు రక్షణ చర్య దేవునితో, ఇతర వ్యక్తులతో మరియు సృష్టితో మన సంబంధాలన్నింటినీ మార్చగలదు.
మరియ మాగ్డలీనాలాగా మనం కూడా క్రైస్తవ నిరీక్షణా విత్తనం ఫలించటానికి, మన హృదయాలను మార్చడానికి మరియు మనం ఎదుర్కొనే సమస్యలకు మనం స్పందించే విధానాలను ప్రభావితం చేయడానికి అనుమతించాలి.
యేసు అనుచరులుగా, మానవ గౌరవం మరియు సృష్టి రక్షణపై దృష్టి సారించే జీవనశైలి మరియు విధానాలను ప్రోత్సహించడానికి పిలవబడ్డాము
ఆంగ్లము మాట్లాడే యాత్రికులు మరియు సందర్శకులను, ముఖ్యంగా ఇంగ్లాండ్, ఐర్లాండ్, సెనెగల్, ఉగాండా, చైనా, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, దక్షిణ కొరియా, వియత్నాం మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి వచ్చిన వారిని ఉదేశించి పోప్ మాట్లాడారు
లూసియానాలోని జేవియర్ విశ్వవిద్యాలయం మరియు టెక్సాస్‌లోని డల్లాస్ విశ్వవిద్యాలయం నుండి విద్యార్థులు మరియు అధ్యాపకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
నిరీక్షణా జూబిలీ మీకు మరియు మీ కుటుంబాలకు కృప మరియు ఆధ్యాత్మిక పునరుద్ధరణ సమయం కావాలని ప్రార్థనాపూర్వక శుభాకాంక్షలతో, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆనందం మరియు శాంతిని మీ అందరికీ ఉండును గాక అని ప్రార్థిస్తున్నాను.