అక్టోబర్ మాస ప్రార్థనా ఉద్దేశాన్ని ప్రకటించిన పోప్ లియో

పోప్ లియో అక్టోబర్ మాస ప్రార్థనా ఉద్దేశాన్ని మానసిక ఆరోగ్య సేవల కొరకు అంకితం చేశారు. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిని తీర్పు లేకుండా ఆలకించి, వారిని ఆదరించాలని శ్రీసభకు పిలుపునిచ్చారు.

మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ స్వాగతం, గౌరవం, నిరీక్షణ లభించేలా శ్రీసభ ఒక తెరిచిన గృహంగా మారాలని పోప్ ప్రార్థించారు.

ఆందోళన, నిరాశ లేదా ఇతర మానసిక అనారోగ్యాలతో ఒంటరిగా బాధపడుతున్న వారిని గుర్తుచేసుకుంటూ, మానసిక అనారోగ్యంపై ఉన్న అపోహలు, వివక్షకు.... క్షమాపణ కోరారు. ఎవరినీ వెలివేయకుండా, తీర్పు లేకుండా ఆలకించే సురక్షితమైన సమాజంగా శ్రీసభ ఉండాలని ప్రార్థించారు.

మానసిక ఆరోగ్య సంరక్షణలో సేవలందిస్తున్న వైద్య నిపుణులు, కుటుంబ సభ్యులు, స్వచ్ఛంద సేవకుల కొరకు పోప్ ప్రార్ధించారు. వారికి బలం, కరుణ ప్రసాదించాలని దేవుని కోరారు.

ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా ప్రజలు మానసిక ఆరోగ్య సమస్యలతో జీవిస్తున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు. వారితో పాటు వారిని ఆదరిస్తున్నవారి కోసం కూడా ఈ అక్టోబర్ మాసమంతా ప్రార్థించాలని, మానసిక ఆరోగ్య సంరక్షణను శ్రీసభ సమాజ జీవితం మరియు సేవలో భాగం చేయాలని పిలుపునిచ్చారు.
 

Tags
Telugu Survey Popup Image