యువతతో పోప్ లియో చారిత్రక డిజిటల్ సమావేశం

నవంబర్ 22, 2025 న నేషనల్ కాథలిక్ యూత్ కాన్ఫరెన్స్ (NCYC)లో పాల్గొన్న 1600 మంది యువతతో పోప్ లియో ఆన్లైన్ లో సమావేశమైయ్యారు.

వేటికన్ నుండి నేరుగా మాట్లాడిన పోప్ వేలాది మంది టీనేజర్లను “మీరు భవిష్యత్తు మాత్రమే కాదు, వర్తమానం కూడా” అని గుర్తుచేశారు. యువత గళ్లం, ఆలోచనలు, సాక్ష్యం శ్రీసభకు అత్యంత అవసరమని అన్నారు.

యువతను ఆదివారం దివ్యబలిపూజలో, యువతా కార్యక్రమాల్లో పాల్గొనడం, విశ్వాసాన్ని పెంపొందించే అవకాశాలను స్వీకరించడం ద్వారా తమ విచారణలో మరింతగా భాగస్వాములు కావాలని ప్రోత్సహించారు. 

“మీరు యేసుని ఎంత ఎక్కువగా తెలుసుకుంటె, అంత ఎక్కువగా ఆయనకు మరియు శ్రీసభకు సేవ చేయాలని అనిపిస్తుంది,” అని పోప్ అన్నారు 

అమెరికా అంతటా నుండి ఎంపికైన ఐదు మంది యువత పోప్‌తో నేరుగా ప్రశ్నలు పంచుకునే అవకాశం పొందారు. పోప్ ప్రేమతో వారికి సమాధానమిచ్చారు.  

బాల్టిమోర్ అగ్రపీఠానికి చెందిన మియా అడిగింది: “మీరు తప్పులు చేసినప్పుడు లేదా ఎవ్వరినైనా నిరాశపరిచినప్పుడు దేవుని కరుణను స్వీకరించడం కష్టంగా అనిపిస్తుందా?”

పోప్ సౌమ్యంగా  “మనలో ఎవరూ పరిపూర్ణులు కాదు.” చెప్పారు “మీరు ప్రపంచాన్ని మార్చాలనుకుంటే, మొదట ప్రభువు మిమ్మల్ని మార్చేందుకు అనుమతించండి.” అని పోప్ హితవు పలికారు 

ఈ డిజిటల్ సమావేశం NCYC యువత మ‌న‌సుల్లో చిరస్మరణీయ ముద్ర వేసిన ఆధ్యాత్మిక క్షణంగా నిలిచింది.

Tags