"దృష్టి" వార్తాలేఖను ప్రచురించిన సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్
"దృష్టి" వార్తాలేఖను ప్రచురించిన సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్
హైదరాబాద్ ,బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో మాస్ కమ్యూనికేషన్ మరియు జర్నలిజం విభాగం "దృష్టి" వార్తాలేఖను ప్రచురించిచారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి. ఉమా జోసెఫ్ గారు దీనిని అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రత్యేక ఎడిషన్‌ను MA I మాస్ కమ్యూనికేషన్ మరియు జర్నలిజం విద్యార్థులు చాలా జాగ్రత్తగా రూపొందించి, నిర్మించారు.
విద్యార్థులను కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ షెర్లీ , కళాశాల కరస్పాండెంట్ సిస్టర్ కార్మలి గార్లు అభినందించారు.
"సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్" మహిళల విద్య కోసం 1959లో సిస్టర్స్ ఆఫ్ ఛారిటీ ఆఫ్ సెయింట్స్ బార్టోలోమియా కాపిటానియో మరియు విన్సెంజా గెరోసా స్థాపించిన కతోలిక మైనారిటీ సంస్థ. ఈ సంస్థ లోక రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి వ్యక్తిత్వం మరియు బోధనల నుండి ప్రేరణ పొందింది.
ఈ సంస్థ పేద ప్రజలకు తమ ప్రేమపూర్వక సేవను అందించడానికి 1860లో మన భారతదేశం వచ్చింది. ఆనాటి నుండి పేద, అణగారిన ప్రజలలో వెలుగు నింపుతూ యువతులకు విద్యను అందించారు. విద్యను అందించడమే కాకుండా, వారికి న్యాయం, సత్యం, మరియు గౌరవప్రదమైన జీవనం వంటి విలువలను వీరు నేర్పించారు. ది సిస్టర్స్ ఆఫ్ ఛారిటీ ఆఫ్ సెయింట్స్. బార్టోలోమియా కాపిటానియో మరియు విన్సెంజా గెరోసా (SCCG) వారి సేవలు వివిధ రూపాలలో ఇంకా కొనసాగుతూనే వున్నాయి.
By M kranthi Swaroop