కథోలిక యువతకు నాయకత్వ లక్షణాల అవగాహనా సదస్సు

తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య టీ.సీ.బీ.సీ యువతా విభాగం వారు కడప మేత్రాసనం, చిత్తూరు జిల్లా, పలమనేరు పునీత లూయిస్ విచారణలో జులై 7 న యువతీ యువకులకు నాయకత్వ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది.

శ్రీకాకుళం పీఠాధిపతులు, TCBC ప్రాంతీయ యువత విభాగ అధ్యక్షులు మహా.పూజ్య రాయరాల విజయకుమార్ తండ్రిగారి అశీసులతో,యువత డైరెక్టర్ గురుశ్రీ సగిలి ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యాక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో 45 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. 

యువత డైరెక్టర్ గురుశ్రీ సగిలి ప్రవీణ్ కుమార్ గారు "యువతను ప్రభుయేసుని మార్గంలో నడవాలని, వారి ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ విచారణ స్థాయిలో, మేత్రాసన స్థాయిలో మరియు ప్రాంతీయ స్థాయిలో వారు చేయవలసిన కార్యక్రమాల గురించి వివరించి, వారు జీవితంలో ఎలా విజయం సాదించాలి అనే అంశాలపై మాట్లాడారు.

ఈ కార్యక్రమం విజయవతంగా జరగడానికి సహకారాన్ని అందించిన పునీత లూయిస్ విచారం గురువులు గురుశ్రీ జయపాల్ గారికి కృతజ్ఞతలు తెలియచేసారు