బెంగుళూరు లో జరుగుతున్న CBCI సర్వసభ్య సమావేశంలో భాగంగా, సోషల్ కమ్యూనికేషన్ - నూతన పరిచర్య ప్రణాళిక అనే అంశంపై మహా పూజ్య హెన్రీ గారు ప్రసంగించారు. ఈ నూతన పరిచర్య ప్రణాళికకు సభ్యులు మరియు అధ్యక్షులు తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సమావేశంలో సభ్యులు అనేక ఇతర అంశాలను గూర్చి చర్చించారు.
మాడ్రిడ్‌కు చెందిన గురువిద్యార్థులతో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సమావేశమయ్యారు. ఆయన వారి కోసం సిద్ధం చేసిన సందేశాన్ని చదవలేదు, సాధారణంగా తనను సందర్శించడానికి వచ్చే ప్రతి గురు విద్యార్థుల సంఘాలతో చేసే విధంగా ప్రశ్నలు మరియు ఆందోళనలకు సమాధానమిచ్చేందుకు దాదాపు రెండు గంటలు గడిపారు.
జేసు సభ గురువు, సెయింట్ జేవియర్స్ యూనివర్శిటీ, కోల్‌కతా (SXUK) వైస్-ఛాన్సలర్ గురుశ్రీ జాన్ ఫెలిక్స్ రాజ్ గారు జనవరి 27, 2024న కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో, మాగిస్ అవార్డుతో సత్కరించబడ్డారు.
రోమ్‌లోని బాంబినో గెసు ఆసుపత్రి, గాజా నుండి వచ్చిన పిల్లల బృందానికి స్వాగతం పలికిన వాటిలో మొదటిది. కుటుంబ సభ్యులతో కలిసి, 4 పిల్లలు గాజాలో వారికి అందుబాటులో లేని అవసరమైన వైద్య సంరక్షణను అందుకోనున్నారు.