SIGNIS ASIA నూతన బోర్డు సభ్యుల ఎన్నిక

SIGNIS ASIA నూతన బోర్డు సభ్యుల ఎన్నిక

 SIGNIS ASIA నూతన బోర్డు సభ్యుల ఎన్నిక 

హో చి మిన్ సిటీ, వియత్నాం | అక్టోబర్ 26, 2026:
ఆసియాలోని కతోలిక  మీడియా రంగానికి ఒక ముఖ్యమైన పరిణామంగా, భారతీయ  ఫాదర్ విక్టర్ విజయ్ లోబో 2026–2030 కాలానికి సిగ్నిస్ ఆసియ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అక్టోబర్ 26న వియత్నాంలోని సైగాన్ నగరంలో జరిగిన సిగ్నిస్ ఆసియా సమావేశంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రక్రియలో 14 సభ్య దేశాల్లోని 12 దేశాల ప్రతినిధులు ప్రత్యక్షంగా, ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు.

ఫాదర్ విక్టర్ విజయ్ లోబో కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు  పరిధికి చెందిన గురువు . అయన  సిగ్నిస్ ఇండియా అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. 

"కంబోడియాకు చెందిన రేడియో వేరితాస్ ఆసియా" ఆన్లైన్ కంటెంట్ ప్రొడ్యూసర్  కుమారి కగ్నాకియో "సిగ్నిస్ ఆసియ కార్యదర్శిగా" ఎన్నికయ్యారు. "బెంగాల్ రేడియో వేరితాస్ ఆసియా " కోఆర్డినేటర్ ఫాదర్ నిఖిల్ గోమ్స్ "సిగ్నిస్ ఆసియ బోర్డు మెంబెర్" గా ఎన్నికయ్యారు. 

ఎన్నికైన ఇతర సభ్యులు, ఉపాధ్యక్షురాలుగా  ఫిలిప్పీన్స్ కు చెందిన మబాంటా-ఫెనోమెనో,    కోశాధికారి గా దక్షిణ కొరియా కు చెందిన పాల్ చాన్ నామ్‌గూంగ్,    
కార్యనిర్వాహక మండలి సభ్యుడు    కుక్ డైసీ ఫామ్(వియత్నాం),ప్రత్యామ్నాయ ప్రతినిధి (Stand-in Delegate)ఫాదర్ ఖైసర్ ఫెరోజ్, OFM Cap    (పాకిస్తాన్) ఎన్నికయ్యారు. 

సిగ్నిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా కతోలిక మీడియా, జర్నలిజం, రేడియో, టెలివిజన్, సినిమా, డిజిటల్ కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేసే వ్యక్తులు, సంస్థలను అనుసంధానించే అంతర్జాతీయ సంఘం.

Article and Design By M Kranthi Swaroop

Telugu Survey Popup Image