సెయింట్ పీటర్స్ బసిలికాకు తరలించిన పోప్ ఫ్రాన్సిస్ భౌతికకాయం

బుధవారం ఏప్రిల్ 23 ఉదయం కాసా సాంటా మార్టా ప్రార్థనా మందిరంలో పోప్ ఫ్రాన్సిస్ కోసం క్లుప్త ప్రార్థన అనంతరం సెయింట్ పీటర్స్ బసిలికాకు, శనివారం ఆయన అంత్యక్రియలు జరిగే వరకు విశ్వాసులు నివాళులు అర్పించడానికి వీలుగా ఆయన భౌతికకాయాన్ని ఉంచబడుతుంది.
హోలీ రోమన్ చర్చికి చెందిన కార్డినల్ కెవిన్ ఫారెల్ మరియు కాలేజీ అఫ్ కార్డినల్స్ నేత్రత్వంలో జరిగింది.
తన ప్రారంభ ప్రార్థనలో కార్డినల్ ఫారెల్ దివంగత పోప్ 12 సంవత్సరాల పరిచర్యకు దేవునికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆ తరువాత కార్డినల్ల మండలి కాసా సాంటా మార్టా నుండి సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లోకి ఊరేగింపుగా తీసుకువెళ్లారు.
పోప్‌కు నివాళులు అర్పించడానికి 20,000 మందికి పైగా ప్రజలు సెయింట్ పీటర్స్ స్క్వేర్ లో గుమిగూడారు, ఆయన శవపేటికను మెట్లు ఎక్కి సెయింట్ పీటర్స్ బసిలికాలోకి తీసుకువెళుతుండగా నిరంతరాయంగా చప్పట్లు కొట్టారు.
గాయక బృందం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని లాటిన్‌లో పునీతుల ప్రార్థనను జపించారు.
బసిలికా గురువారం ఉదయం 7 గంటల నుండి అర్ధరాత్రి వరకు మరియు శుక్రవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుంది.