సామాన్య సంఘాలు మరియు విశేష పరిచర్య ఉద్యమాల సమన్వయకర్తలతో సమావేశమైన పోప్

శుక్రవారం జూన్ 6 సామాన్య సంఘాలు మరియు విశేష పరిచర్య ఉద్యమాల  నాయకులతో XIV లియో పోప్ సమావేశమయ్యారు 

వారి ప్రయత్నాలలోను, పనులలోను ఎల్లప్పుడూ క్రీస్తు కేంద్రీకృత జీవితాన్ని జీవించాలని ప్రోత్సహించారు  

రోమ్‌లో,హోలీ సీ గృహస్థ క్రైస్తవుల, క్రైస్తవ కుటుంబాల సేవ విభాగం వారు నిర్వహిస్తున్న వార్షిక సమావేశానికి హాజరైన సంఘాల సమన్వయకర్తలు, అంతర్జాతీయ నాయకులు మరియు ప్రతినిధులను ఉద్దేశించి పోప్ ప్రసంగించారు.

బైబిల్ బోధనలను, శ్రీసభ ధర్మాన్ని అనుసరిస్తూ నవ్య సువార్తికరణలో భాగం పంచుకోవాలని ఆయన ఆదేశించారు.

క్రీస్తును కేంద్ర బిందువుగా మలుచుకొని దేవుని కృపను పొందుకోవాలని,సువార్త ఫలాలను ప్రతి ఒక్కరికి పంచాలని పోప్ అన్నారు