శ్రీకాకుళంలో మేత్రాసన యువతా సదస్సు మరియు జాబ్ మేళా

శ్రీకాకుళం మేత్రాసనం  2025 మే 3 నుండి 5 వరకు మరియగిరి పుణ్యక్షేత్రంలో మూడు రోజుల యువతా సదస్సు మరియు మెగా జాబ్ మేళాను విజయవంతంగా నిర్వహించింది.

ICYM శ్రీకాకుళం మేత్రాసనం వారు డాన్ బాస్కో (DISHA) మరియు నేషనల్ కెరీర్ సర్వీసెస్ సహకారంతో ఈ జాబ్ మేళ జరిగింది

యువతకు స్ఫూర్తిని, సాధికారతను మరియు ఉపాధి మార్గాలను సృష్టించడం, ఆధ్యాత్మిక నిర్మాణాన్ని జీవన ప్రగతితో మిళితం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం.

శ్రీకాకుళం పీఠాధిపతులు మరియు TCBC యువత విభాగ చైర్మన్ మహా పూజ్య డాక్టర్ రాయరాల విజయ కుమార్ PIME నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో గురుశ్రీ మేడిపల్లి స్లీవ రాజు SDB (మేత్రాసన యువతా డైరెక్టర్), గురుశ్రీ  జస్టిన్ SDB (మేత్రాసన డైరెక్టర్, హైదరాబాద్), మిస్టర్ సుధీర్ (మేత్రాసన యూత్ ప్రెసిడెంట్) మరియు మిస్టర్ రాజు చల్లగలి ( ICYM తెలుగు ప్రాంతీయ యూత్ ప్రెసిడెంట్) మార్గదర్శకత్వం వహించారు.

నాయకత్వం, సమాజం మరియు వ్యక్తిగత వృద్ధిని పెంపొందించడానికి రూపొందించిన వివిధ కార్యకలాపాలలో మేత్రాసనం నుండి సుమారు 300 మంది యువకులు పాల్గొన్నారు.

Retail, ఐటీ సేవలు, తయారీ, విద్య మరియు కస్టమర్ సపోర్ట్ వంటి రంగాలలోని 15  ప్రసిద్ధ కంపెనీలు జాబ్ మేళా సందర్భంగా ఆన్-ది-స్పాట్ రిక్రూట్‌మెంట్ నిర్వహించాయి.

110 మంది హాజరైన వారిలో 72 మంది అభ్యర్థులకు తక్షణ ఉద్యోగ ఆఫర్లు లభించాయి.

ఈ కార్యక్రమం గ్రామీణ యువత ఎదుర్కొంటున్న ఉపాధి సవాళ్లను పరిష్కరించడమే కాకుండా, సమగ్ర యువత అభివృద్ధిలో శ్రీసభ పాత్రను పునరుద్ఘాటించింది.