మానవాళికి కృత్రిమమేధసు ముప్పు అన్న 14వ సింహరాయలు పోప్

ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత కీలక సవాళ్లలో కృత్రిమమేధసు (ఏఐ) ఒకటని విశ్వ కాపరి 14వ సింహరాయలు పోప్ శనివారం కార్డినల్ల మండలితో తన మొదటి అధికారిక సమావేశంలో పేర్కొన్నారు

14వ సింహరాయలు పోప్ తాను ఎంచుకున్న పేరు వెనుక ఉన్న ప్రేరణను వెల్లడించారు - ఇది అతని స్వంత మాటలలో, మానవ గౌరవం మరియు సామాజిక న్యాయం పట్ల శ్రీసభ శాశ్వత నిబద్ధత తెలియచేస్తుందన్నారు

మానవ ఔన్నత్యం, న్యాయం, శ్రమలను కాపాడటంలో ఇది సవాళ్లను విసురుతుందన్నారు.

ఇటీవల మరణించిన స్వర్గీయ పోప్ ఫ్రాన్సిస్ తన చివరిదశలో కూడా మానవాళికి కృత్రిమమేధసు ముప్పు గురించి పదే పదే ప్రస్తావిస్తూ దీని కట్టడికి ఓ అంతర్జాతీయ ఒప్పందం అవసరమని నొక్కిచెప్పిన విషయం విదితమే.

స్వర్గీయ పోప్ ఫ్రాన్సిస్ చేపట్టిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను 14వ సింహరాయలు పోప్ కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేశారు.