పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపిన కార్డినల్లు

శనివారం ఏప్రిల్ 26 న జరిగిన పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు హాజరైన ఇతర క్రైస్తవ పెద్దలకు ఇస్లాం, యూదు మతం మరియు ఇతర మతాల ప్రతినిధులకు కార్డినల్ల మండలి కృతజ్ఞతలు తెలిపింది.
అలాగే హాజరైన వివిధ దేశాధినేతలు మరియు ప్రభుత్వ ప్రతినిధులకు కూడా కార్డినల్ల మండలి తమ అభినందనలు తెలిపినట్లు హోలీ సీ నుండి ఒక పత్రికా ప్రకటన పేర్కొంది
ఇటాలియన్ అధికారులు,రోమ్ నగరం భద్రతా సేవకులు,సివిల్ డిఫెన్స్,మీడియా మరియు
హోలీ సీ, వాటికన్ సిటీ స్టేట్ గవర్నరేట్ ఉద్యోగులకు" కూడా కృతజ్ఞతలు తెలిపారు.
వారాంతంలో టీనేజర్ల జూబ్లీ దివ్యబలి పూజలో పాల్గొన్న యువకులకు కృతజ్ఞతలు తెలుపుతూ కార్డినల్ల మండలి తమ ప్రకటనను ముగించింది